News April 11, 2025

అపార్‌ గుర్తింపు నమోదులో నిజామాబాద్ 5వ స్థానం

image

విద్యార్థులకు అపార్ గుర్తింపు నమోదులో NZB జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యార్థుల్లో మొత్తం 62.83 శాతం మందికి అపార్‌ గుర్తింపు నంబరును జారీ చేయగా మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా ఉంది. ఐదవ స్థానంలో నిజామాబాద్‌ జిల్లా నిలిచినట్లు డీఈవో అశోక్ తెలిపారు. అపార్ మోదులో సమస్యలను పరిశీలించి త్వరలోనే మొదటి స్థానంలో నిలుపుతామని డీఈఓ అన్నారు.

Similar News

News November 21, 2025

TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

image

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.

News November 21, 2025

NZB: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: TWJF

image

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని TWJF నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లోని విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచందర్ రెడ్డి, రాజు, పరమేశ్వర్, భాస్కర్, ప్రవీణ్, అనిత తదితరులు పాల్గొన్నారు.

News November 21, 2025

ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి నిజామాబాద్ రచయితకు ఆహ్వానం

image

ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి NZB జిల్లాకు చెందిన రచయిత ప్రేమ్ లాల్‌ ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి పిలుపు రావడం పట్ల ప్రేమ్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. సాహితీ మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.