News November 17, 2024
అపార్ జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్
అపార్ జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అనంతపురంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అపార్ జనరేషన్ ప్రక్రియపై డిఇఓ, డివిఈవో, ఆయా కళాశాల ప్రిన్సిపల్, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు అపార్ జనరేషన్ జరిగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 7, 2024
ఫ్రాన్స్ యువతిని పెళ్లాడిన గొల్లపల్లి యువకుడు
శ్రీ సత్యసాయి జిల్లా యువకుడు ఫ్రాన్స్ యువతిని పెళ్లాడారు. గోరంట్ల మం. గొల్లపల్లికి చెందిన సందీప్ యాదవ్ ఫ్రాన్స్‌లోని సీఎన్ఆర్ యూనివర్సిటీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. అదే నగరంలో గూగుల్‌లో పనిచేస్తున్న అడ్‌సవిన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో హిందూపురం పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి చేసుకున్నారు.
News December 7, 2024
ATP: 30 మంది ఏఎస్సైలు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ
అనంతపురం జిల్లాలో 30 మంది ఏఎస్సైలు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ చేశారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో వారికి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి బదిలీ చేశారు. ఒకే పోలీసు స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. బదిలీల ప్రక్రియకు కొలమానమైన నిబంధనలను సిబ్బందికి ఎస్పీ వివరించారు.
News December 7, 2024
ATP: 30 మంది ఏఎస్సైలు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ
అనంతపురంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో 30 మంది ఏఎస్సైలు, 79 మంది హెడ్ కానిస్టేబుళ్లకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి బదిలీ చేశారు. ఒకే పోలీసు స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. బదిలీల ప్రక్రియకు కొలమానమైన నిబంధనలను సిబ్బందికి ఎస్పీ వివరించారు.