News April 18, 2024

అప్‌డేట్: BJPలో చేరిన ఉప్పల్ మాజీ MLA

image

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి(BRS) గురువారం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ నామినేషన్‌లో భాగంగా మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన BJP పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈటలకు మద్దతుగా నిలుస్తానని సుభాష్ రెడ్డి ప్రకటించారు.

Similar News

News November 22, 2025

HYD: ఐబొమ్మ రవి కేసులో సీఐడీ రంగ ప్రవేశం

image

ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు. నాలుగు బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోషన్ చేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి సీఐడీ సేకరించింది. రవి ఆర్థిక లావాదేవీలపైనా వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

News November 22, 2025

HYD: వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరం: సీపీ

image

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న పాతబస్తీ పేట్ల బురుజు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరమన్నారు.

News November 22, 2025

HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

image

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.