News April 18, 2024
అప్‌డేట్: BJPలో చేరిన ఉప్పల్ మాజీ MLA
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి(BRS) గురువారం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ నామినేషన్‌లో భాగంగా మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన BJP పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈటలకు మద్దతుగా నిలుస్తానని సుభాష్ రెడ్డి ప్రకటించారు.
Similar News
News September 10, 2024
HYD: టీవీవీపీ ఆస్పత్రుల్లోని సిబ్బందికి జీతాలు చెల్లించాలి
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, ఇతర సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే సీఎంకు వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
News September 10, 2024
HYD: వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు 3 ప్రాంతాల పరిశీలన
HYD శివారులో రానున్న ప్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో మన HYDలోనూ సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు. ఇందుకు 3ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 70 ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు.
News September 10, 2024
HYD: గండిపేట చెరువులో భారీ చేప (PHOTO)
ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు గండిపేట చెరువు నిండుకుండలా మారింది. దీంతో జాలరులు చేపల వేట కొనసాగిస్తున్నారు. సోమవారం మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కి చెందిన కొంతమంది చేపల వేటలో పడ్డారు. దాదాపు 12 కిలోలకు పైగా చేప వలకు చిక్కింది. ఇది తెలుసుకున్న యువత గాళాలు వేసి చేపలు పట్టేందుకు ఆసక్తి చూపించారు.