News November 13, 2024

అప్పట్లో చీఫ్ విప్.. ఇప్పుడు విప్

image

రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు సీఎం చంద్రబాబు మరోసారి ప్రాధాన్యం ఇచ్చారు. అసెంబ్లీలో విప్‌గా ఆయనను ఎంపిక చేశారు. 2014 నుంచి 2017 వరకు అప్పట్లో ఆయన చీఫ్ విప్‌గానూ వ్యవహరించారు. ఆ తర్వాత 2017-19 వరకు మంత్రిగా పని చేశారు. 1999లో టీడీపీలో చేరిన కాలవ శ్రీనివాసులు అదే సంవత్సరం అనంతపురం ఎంపీగా గెలిచారు. తర్వాత 2004, 09లో ఓడినప్పటికీ 2014లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.

Similar News

News December 8, 2024

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News December 8, 2024

అనంత జిల్లాలో 982 ఎం.వి కేసుల నమోదు

image

అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 982 ఎం.వీ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ ఎం.వీ కేసులకు సంబంధించిన నిందితుల నుంచి రూ.2,21,625లు జరిమానా విధించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు కేవలం ఒకరోజులోనే ప్రగతి సాధించారు. అంతే కాకుండా అలాగే ఓపెన్ డ్రింకింగ్ కేసులో 45, డ్రంకన్ డ్రైవ్ రెండు కేసులు, నమోదు చేశామన్నారు.

News December 8, 2024

యువతిపై కత్తితో దాడి.. మంత్రి సవిత సీరియస్

image

కడప జిల్లా వేములలో యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేసిన ఘటనపై ఇన్‌ఛార్జి <<14821476>>మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం<<>> వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి ఎస్పీ విద్యాసాగర్‌తో ఫోన్లో మాట్లాడి, తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధిత యువతికి మెరుగైన వైద్యమందించాలని తిరుపతి రుయా వైద్యులను మంత్రి సవిత సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనీ హామీ ఇచ్చారు.