News April 5, 2025
అప్పన్న స్వామి దర్శన వేళలో మార్పులు ఇవే..

ఈ నెల 8వతేదీ సింహద్రి అప్పన్న స్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో ఈనెల 7 నుంచి 24వరకు దర్శన వేళ్లలో మార్పులు చేశారు. ఈ రోజుల్లో అర్జీత సేవలు ఉండవని అర్చకులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. 7వ తేదీ నుంచి 14 వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన సేవల్లో భాగస్వామ్యం ఉండదన్నారు. అలాగే రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ఉండవు. 10వ తేదీన ఉదయం 8గంటల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News April 6, 2025
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అల్లూరి జిల్లాకు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం విశాఖ రానున్నారు. సోమవారం తెల్లవారి 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన అల్లూరి జిల్లా వెళ్తారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేసి అరకులో బస చేస్తారు. మంగళవారం అరకు నుంచి విశాఖ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం విశాఖలో బస చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
News April 6, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

విశాఖలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మల్కాపురానికి చెందిన సత్యనారాయణ స్కూటీపై కుమార్తె ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డాక్యార్డ్ నుంచి మారుతీ సర్కిల్ మీదుగా వెళుతుండగా కొత్త పెట్రోల్ బంక్ వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News April 6, 2025
పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్పై లెర్నింగ్ నిర్వహించిన సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ పై సీపీ శంఖబ్రత బాగ్చి అవగాహనా కల్పించారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి అవగాహనా కల్పించారు. ప్రతి పోలీసు కుటుంబానికి మెడికల్ భద్రత అవసరమన్నారు. కంట్రోల్ రూమ్లో 24/7 పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెల్ ద్వారా ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ను పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ చూసుకుంటుందన్నారు.