News June 22, 2024

అప్పుడు ఈ బుద్ధి ఏమైంది జగన్: ధూళిపాళ్ల నరేంద్ర

image

ఐదేళ్ల పాటు విధ్వంస పాలన సాగించిన జగన్ బీద అరుపులను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని పొన్నూరు MLA ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ‘ప్రజా వేదిక కూల్చినప్పుడు, నీ ఇంటి కోసం పేదల ఇళ్లు అన్యాయంగా పడగొట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది జగన్ రెడ్డి..?. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న నీ పార్టీ ఆఫీసు జోలికి వస్తే గానీ నీకు చట్టం, న్యాయం గుర్తుకురాలేదా..?’ అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

Similar News

News December 4, 2025

నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

image

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.

News December 3, 2025

NAKSHA కింద రూ.125 కోట్లు మంజూరు: పెమ్మసాని

image

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా APకు కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మోదీ దూరదృష్టితో, CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్  నాయకత్వంలో AP పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ‘X’ లో ట్వీట్ చేశారు.

News December 3, 2025

ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.