News March 22, 2024

అప్పుడు గల్లా.. ఇప్పుడు పెమ్మసాని

image

టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు ఖరారైంది. 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ అనూహ్యంగా రాజకీయాలకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషించింది. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలతో పేరు పొందిన పెమ్మసాని తెరపైకి వచ్చారు. దీంతో ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పోటీ చేయనున్నారు.

Similar News

News April 19, 2026

ఆన్‌లైన్‌లో PGRS అర్జీలు సమర్పించవచ్చు: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని అన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News April 19, 2026

భవననిర్మాణ కార్మికుల పేర్లు నమోదు చేసుకోవాలి: GNT కలెక్టర్

image

భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను కార్మికశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వివాహ కానుక, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్య క్రియలకు రూ.20 వేలు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు.

News April 19, 2026

అమరావతి ఐకానిక్ టవర్లకు టెండర్లు

image

అమరావతిలోని 5 ఐకానిక్ భవనాల్లో కీలక పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టవర్ 1, 2, 3, 4లతో పాటు జీఏడీ టవర్‌కు ఎంఈపీ టెండర్లు జారీ చేసింది. టవర్ 1, 2లకు రూ.743.02 కోట్లు, టవర్ 3, 4లకు రూ.681.47 కోట్లు, జీఏడీ టవర్‌కు రూ.431.59 కోట్లు అంచనా వేశారు. భవనాల్లో విద్యుత్, ప్లంబింగ్, ఏసీ, ఫైర్ సేఫ్టీ పనులను 18 నెలల్లో పూర్తి చేసి, రెండేళ్లు నిర్వహణ చూడాలి.