News June 5, 2024

అప్పుడు నిజామాబాద్ కలెక్టర్లు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు

image

గతంలో నిజామాబాద్ కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు.. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఉమ్మడి తూ.గో జిల్లా రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన దేవవరప్రసాద్ 39,011 ఓట్లతో గెలిచారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటి చేసిన బి.రామాంజనేయులు 41,151 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా ఈ ఇద్దరు గతంలో నిజామాబాద్ కలెక్టర్లుగా పనిచేశారు.

Similar News

News July 5, 2025

NZB: ప్రణాళికబద్ధంగా కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, నివేశన స్థలాల క్రమబద్దీకరణ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు.

News July 5, 2025

NZB: 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

image

బాసర జోన్-2లో పని చేస్తున్న 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి లభించింది. వీరిని నిజామాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రియాజుద్దీన్, జక్రయ్య, పరమేశ్వర్, వసంతరావు, అరుణ కుమారి, అనురాధ, రమనేశ్వరి, ముంతాజ్ బేగం, సతీశ్ కుమార్ ASIలుగా పదోన్నతి పొందారు.

News July 5, 2025

డొంకేశ్వర్ మండలం నుంచి 41 మంది IIITకి ఎంపిక

image

డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.