News March 29, 2024

అప్పుడు మాజీ CM కుమార్తె.. ఇప్పుడు మాజీ CM

image

రాజంపేట MP అభ్యర్థిగా మరోసారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనున్నారు. 2014, 19లో గెలిచిన ఆయన హ్యాట్రిక్‌పై కన్నేశారు. 2014లో ఆయన ప్రత్యర్థిగా మాజీ CM ఎన్టీఆర్ కుమార్తె పురందీశ్వరి పోటీ చేశారు. 2019లో TTD మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ TDP తరఫున బరిలో నిలిచారు. తాజా ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా గెలుపు ఎవరిదో చూడాలి.
#Elections2024

Similar News

News January 24, 2025

తిరుపతిలో అమానుష ఘటన

image

తిరుపతి నగరంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థి శ్రీకాళహస్తిలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతికి ఇంటికి రాగా.. నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 

News January 24, 2025

తిరుపతి: ఫిబ్రవరి 3 నుంచి పరీక్షల ప్రారంభం

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. డిగ్రీ తృతీయ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మూడో తేదీ, మొదటి సంవత్సరం పరీక్షలు 14వ తేదీ నుంచి ప్రారంభమం అవుతాయి. అభ్యర్థులు ఇతర వివరాలకు www.svudde.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

News January 24, 2025

చిత్తూరు ఎస్పీకి ఉత్తమ జాతీయ అవార్డు

image

గత అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకు అవార్డు వచ్చింది. ఉత్తమ ఎన్నికల నిర్వహణ జాతీయ అవార్డుకు ఆయన సెలెక్ట్ అయ్యారు. విజయవాడలో 25న జరిగే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సభలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎస్పీ అవార్డు వచ్చిందని పలువురు పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.