News May 22, 2024

అప్పుల బాధ ఎక్కువై యువ రైతు ఆత్మహత్య

image

బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యువ రైతు అప్పుల బాధ ఎక్కువై గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలకు వెళితే.. ప్రవీణ్ కుమార్ వ్యవసాయంలో అప్పులు కావడంతో తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతణ్ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు ఆవరించాయి.

Similar News

News November 24, 2025

ప్రొద్దుటూరులో అంతా జీరో వ్యాపారమే..?

image

ప్రొద్దుటూరులో జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఇక్కడ ఫైనాన్స్, బంగారం, హవాలా, సినిమా, రియల్ ఎస్టేట్, ఎలక్షన్స్‌లో ఇక్కడి వ్యాపారులు రూ.వేల కోట్లు పెట్టుబడులు, రుణాలు ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రభుత్వ అనుమతులు, పన్నులు లేకుండానే సాగుతున్నట్లు సమాచారం. వ్యాపారి శ్రీనివాసులుపై జీరోలో అభరణాలు, స్కీములు, చీటీల వ్యాపారంపై ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయి.

News November 24, 2025

ప్రొద్దుటూరు: బంగారు వ్యాపారి బాధితులు ఎందరో..?

image

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి తనిగంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. వ్యాపారంలో మోసం చేసి తమను బయటికి గెంటేశారని మరదలు పద్మజ ఫిర్యాదు చేశారు. HYD హేమంత్ శర్మ, మార్వాడి షమీర్, JMD సంధ్య, BDVL శ్రావణి, లేఖ ఇలా ఎందరో తమకు బంగారం బాకీ ఉన్నాడంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చట్ట విరుద్ధంగా స్కీం, చీటీల వ్యాపారంలో మోసం చేశాడంటూ బాధితులు వాపోతున్నారు.

News November 24, 2025

రేపు పులివెందులలో జగన్ పర్యటన

image

మాజీ సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన ఒక వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి అరటి తోటలను సందర్శించి, లింగాల మాజీ సర్పంచి మృతి పట్ల కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత వేల్పులలో స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు.