News April 12, 2025

అప్పుల భారంతో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య

image

అల్లవరం మండలం తాడికోనకు చెందిన అంగన్వాడీ టీచర్ గెడ్డం నాగమణి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందని అల్లవరం ఎస్ఐ తిరుమలరావు శుక్రవారం తెలిపారు. 20 రోజుల క్రితం గడ్డి మందు తాగి సూసైడ్‌కు పాల్పడిన ఆమెను అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఆమె అప్పులు చేసి కొత్తగా ఇల్లు కట్టిందన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 25, 2025

సిరిసిల్ల: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అందే నీరజ(27) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, మృతురాలి భర్త దేవరాజ్ గల్ఫ్ దేశంలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు.

News November 25, 2025

బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకులం భవనం ప్రారంభం

image

బాపట్ల మండలం నరసాయపాలెంలో 1.10 కోట్ల రూపాయలతో నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని ఎంపీ కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గ్లోరియా, ఎమ్మార్వో తదితర అధికారులు పాల్గొన్నారు.

News November 25, 2025

నిర్మల్: కలెక్టర్‌కు ఎస్పీ అభినందన

image

జలసంచాయ్–జనభాగీదారీ అవార్డును కలెక్టర్ అభిలాష అభినవ్ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా స్వీకరించారు. మంగళవారం కలెక్టరేట్‌ చాంబర్‌లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీ ఫైజాన్ అహ్మద్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేక్‌ కట్‌ చేయించారు.