News April 16, 2025
అప్పుల భారం ఉన్నా వాగ్దానాలను అమలు చేస్తున్నాం: జూపల్లి

గత ప్రభుత్వ అసంబద్ధ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గత ప్రభుత్వం కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తోందన్నారు.
Similar News
News April 20, 2025
సిరిసిల్ల :సోమవారం ప్రజావాణి రద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 21 సోమవారం హై కోర్టు కేసు విషయంలో వ్యక్తిగతముగా హాజరవుతున్న కారణంగా అందుబాటులో ఉండటం లేదన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News April 20, 2025
మగవాళ్లకూ ‘హీ’ టీమ్స్ ఉండాలి: పురుషులు

మహిళలకు ‘షిీ’ టీమ్స్‌లాగే పురుషులకు కూడా ‘హీ’ టీమ్స్ ఉండాలని భార్యాబాధితులు డిమాండ్ చేశారు. భార్యల చిత్రహింసల నుంచి తమను కాపాడాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల భార్యాబాధితులు ఢిల్లీలోని ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువమంది బాధితులు పాల్గొన్నారు. వీరంతా ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ పేరుతో ఆందోళన చేపట్టారు. తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా కూడా ఇందులో పాల్గొనడం విశేషం.
News April 20, 2025
DSC: కర్నూలు జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. కర్నూలు జిల్లాలో 209 ఎస్ఏ పీఈటీ, 1,817 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 2,645 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 10 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో మొత్తం 33 పోస్టులు ఉన్నాయి.