News July 27, 2024
అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: డీఎస్పీ
అప్రమత్తంగా ఉండటం వల్ల సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం వద్ద ఉన్న పశువైద్య కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ అడిక్షన్, యాంటీ ర్యాగింగ్, రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. అమ్మాయిలు సైబర్ క్రైమ్స్ బారిన పడి లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. ఆన్లైన్ గేమ్స్, యాప్స్ వల్ల నష్టపోతున్నారని తెలిపారు.
Similar News
News October 7, 2024
YVU బీటెక్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
కడప YVU, ప్రొద్దుటూరు YSR ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ 2,4 సెమిస్టర్లు, బిటెక్ డిప్లమా 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొ కె కృష్ణారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈశ్వర్ రెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంరెడ్డితో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ 59.04 శాతం, 4వ సెమిస్టర్ 62.38 శాతం, బీటెక్ డిప్లొమా 79.70 శాతం ఫలితాలు వచ్చాయన్నారు.
News October 7, 2024
రాజంపేట: బైక్ స్కిడ్.. కుమారుడి మృతి
తండ్రీ కొడుకులు బైక్‌పై బయటకు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి కొడుకు మృతి చెందిన ఘటన రాజంపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాజంపేటలోని పాత బస్టాండ్ సర్కిల్‌లో ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడుకు చెందిన తండ్రీ బాబూరామ్, పెద్ద కుమారుడు శ్యామ్ (5)బైక్‌పై వెళ్తున్నారు. బండి ఒక్కసారిగా స్కిడ్ అయి కొడుకు తల బలంగా రోడ్డును తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News October 7, 2024
అన్నమయ్య: పిడుగు పడి ఇద్దరు కూలీలు మృతి
పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సంబేపల్లి మండలం సోమవరం గ్రామం బావులకాడపల్లి జగనన్న కాలనీ సమీపంలోని వ్యవసాయ పొలంలో, పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.