News January 18, 2025

అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ విచారణ

image

అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగలను ఆటో డ్రైవర్ తీసుకెళ్లారు. దొంగలను వదిలిపెట్టిన ఆటో డ్రైవర్‌ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ విచారణలో తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News February 15, 2025

సంత్ సేవాలాల్ మహారాజ్‌కు నివాళులు అర్పించిన సీఎం

image

బంజారాజాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో వారి అధికారిక నివాసంలో సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.

News February 15, 2025

HYD: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు

image

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆర్జీలు వచ్చాయి. మొత్తం 1,233 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ మంది ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం 974 ఆర్జీలు వచ్చాయని ప్రజావాణి కోఆర్డినేటర్ రాకేశ్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చామని తెలిపారు.

News February 15, 2025

HYD: 17న KCRపై స్పెషల్ సీడీ: తలసాని

image

ఈనెల 17న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్ చేసిన అనంతరం కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీ విడుదల చేస్తామన్నారు.

error: Content is protected !!