News February 8, 2025
అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738998860768_50024734-normal-WIFI.webp)
అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 9, 2025
హైదరాబాద్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739026138236_51951851-normal-WIFI.webp)
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.
News February 8, 2025
HYD: ఢిల్లీలో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్‌రావు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739000870500_51984374-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘం అన్నారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని విమర్శించారు.
News February 8, 2025
GHMC వాటర్ బోర్డ్ వెబ్సైట్ మొరాయింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739000067691_1212-normal-WIFI.webp)
HYD మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్‌బోర్డు వెబ్సైట్ మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్ బుకింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. బిల్లుల చెల్లింపులూ జరగలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల క్రితం వాటర్‌బోర్డు వెబ్సైట్ సర్వర్ హ్యాక్ అయ్యిందని సాంకేతిక సమస్యలు తలెత్తగా, తాజాగా వాటర్‌బోర్డు సర్వర్ మొరాయించడంతో వెబ్సైట్ పని చేయలేదు.