News February 8, 2025
అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News March 24, 2025
ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి: జగన్

AP: రైతుల విషయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, తమ ప్రభుత్వంలో పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదని మాజీ CM జగన్ అన్నారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కడప (D) లింగాలలో అరటి రైతులను <<15868939>>పరామర్శించిన<<>> ఆయన మాట్లాడుతూ.. ‘రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సొమ్ము ఇవ్వాలి. సాయం అందని వారిని మరో మూడేళ్లలో మేం అధికారంలోకి వచ్చి ఆదుకుంటాం’ అని తెలిపారు.
News March 24, 2025
ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 24, 2025
భద్రాద్రి రామయ్యకు ముత్తంగి అలంకరణ

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.