News August 23, 2024

అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ హానర్స్ స్పెషల్ ఉర్దూ కోర్సు

image

డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ హానర్స్ స్పెషల్ ఉర్దూ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ.లోకనాథ శుక్రవారం తెలిపారు. బీఏ హానర్స్ స్పెషల్ ఉర్దూలో ఇంటర్మీడియట్, మదరస బోర్డు ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఈ కోర్సు అర్హత వివరాలు ఉర్దూ యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు ఆయన తెలిపారు.

Similar News

News September 12, 2024

వరద బాధితులకు రూ.11 లక్షల విరాళం

image

కర్నూలు: వరద బాధితుల సహాయార్థం రూ.11 లక్షలు అందజేశామని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. విజయవాడలోని సచివాలయంలో మంత్రి నారా లోకేశ్‌‌ను ఎమ్మెల్సీ రామలింగారెడ్డితో కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సుబ్బారెడ్డిని లోకేశ్ అభినందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి మరింతమంది ముందుకు రావాలని కోరారు.

News September 12, 2024

నంద్యాల: కూతురుకి వింత వ్యాధి.. తల్లిదండ్రుల ఆవేదన

image

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన నాగేశ్వరరావు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కొడుకు రవికుమార్ గతేడాది జూలైలో విల్సన్ అనే వింత వ్యాధికి గురై, కాలేయంలో రాగి నిల్వలు పేరుకుపోయి పదేళ్ల వయసులో మరణించాడు. రెండో సంతానం అయిన విజయలక్ష్మికీ అదే వ్యాధి సోకింది. కుమార్తె కూడా తమకు దక్కదని, వైద్యం కోసం రూ.40 లక్షలు అవసరమని ఆవేదన చెందుతున్నారు.

News September 12, 2024

స్పెషల్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు అవకాశం

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2015-2018 వరకు డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకునేందుకు అభ్యర్థులు స్పెషల్ సప్లిమెంటరీ చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.