News May 24, 2024
అభయారణ్యంలో అలరిస్తున్న జింకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలోని అభయారణ్యంలో 140 జింకలు పర్యాటకులను అలరిస్తున్నాయి. 1974లో 8 జింకలతో ఈ అరణ్యం మొదలైంది. ప్రస్తుతం జింకల సంతతి 140కి చేరింది. గతంలో సింగరేణి సంస్థ వీటి బాధ్యతను చూసేది. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో అభయారణ్యం కొనసాగుతోందని రేంజర్ శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News November 21, 2025
ఖమ్మంలో ఫుట్ పాత్ల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. నగరంలో ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై చర్చించారు. వైరా రోడ్డు, బైపాస్, ఇల్లందు రోడ్డు వంటి 8 ప్రధాన రోడ్లకు ఫుట్ పాత్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.
News November 21, 2025
ఖమ్మం ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

‘లక్కీ డ్రా’ పేరుతో వచ్చే మోసాలను నమ్మి ప్రజలు నష్టపోవద్దని వన్ టౌన్ సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వెంటనే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయాలని, వివరాలు తెలిపిన వారి ఫోన్ నంబర్లు గోప్యంగా ఉంచబడతాయని సీఐ తెలిపారు.
News November 21, 2025
ఖమ్మం: ఆర్వో ప్లాంట్ల దందా.. ప్రజారోగ్యానికి ముప్పు

ఖమ్మం జిల్లాలోని అనేక ఆర్వో వాటర్ ప్లాంట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పరిశుభ్రత పాటించకపోవడంతో నీటిలో ఈ-కోలీ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. అధికారుల నిఘా లోపం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


