News May 24, 2024
అభయారణ్యంలో అలరిస్తున్న జింకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలోని అభయారణ్యంలో 140 జింకలు పర్యాటకులను అలరిస్తున్నాయి. 1974లో 8 జింకలతో ఈ అరణ్యం మొదలైంది. ప్రస్తుతం జింకల సంతతి 140కి చేరింది. గతంలో సింగరేణి సంస్థ వీటి బాధ్యతను చూసేది. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో అభయారణ్యం కొనసాగుతోందని రేంజర్ శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News February 13, 2025
వృద్ధ దంపతులు సూసైడ్.. కారణమిదే..!

ఖమ్మం బ్యాంక్ కాలనీలో <<15433998>>వృద్ధ దంపతులు సూ<<>>సైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కష్టపడి దాచుకున్న సొమ్ము అప్పుగా ఇస్తే.. తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వైద్యానికి డబ్బులేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.
News February 13, 2025
ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో నేడు (గురువారం) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం నగరం, కొణిజర్ల మండలాల్లో పర్యటించి పలు భాదిత కుటుంబాలను పరామర్శిస్తారని అన్నారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.
News February 13, 2025
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశానికి అడ్మిషన్లు

తెలంగాణ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు మైనారిటీస్ గురుకుల పాఠశాల, కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 28వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.