News December 9, 2024

అభయారణ్యంలో వ్యవసాయ విద్యార్థుల పర్యటన

image

జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో జగిత్యాల వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం వారు జన్నారం మండలంలోని గోండుగూడా, తదితర అటవీ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి బటర్ఫ్లై పరిరక్షణ కేంద్రం, అడవులు వన్యప్రాణుల సంరక్షణ, తదితర వివరాలను అటవీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News October 28, 2025

నిర్లక్ష్యం చేస్తే చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

image

2023-24 సీజన్‌కు సంబంధించిన మిగిలిన నాన్‌ అకౌంటెడ్ మిల్లర్ల వద్ద ఉన్న సన్న బియ్యాన్ని తక్షణం సరఫరా చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. డిసెంబర్ చివరి నాటికి వందశాతం సరఫరా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి వారం మిల్లర్లు తమ సరఫరా పురోగతిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, నివేదికలు సమర్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

News October 28, 2025

నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయ‌న ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో నమోదైన నవజాత శిశు మరణాలపై సమగ్రంగా విశ్లేషణ చేయాలని సూచించారు.

News October 28, 2025

ఆదిలాబాద్: ఏజెన్సీ సర్టిఫికెట్ల మాఫియా బహిర్గతం: ASU

image

ఫేక్ ఏజెన్సీ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టిన లంబాడ తెగ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ ASU జిల్లా కార్యదర్శి సిడాం శంభు డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ రిజర్వేషన్ హక్కులపై కత్తి లాంటి దెబ్బగా మారిన ఫేక్ ఏజెన్సీ సర్టిఫికెట్ల మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్నూర్ మండలానికి చెందిన జాదవ్ నికేశ్ కేసు ఇందుకు నిదర్శనమన్నారు.