News December 9, 2024

అభయారణ్యంలో వ్యవసాయ విద్యార్థుల పర్యటన

image

జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో జగిత్యాల వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం వారు జన్నారం మండలంలోని గోండుగూడా, తదితర అటవీ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి బటర్ఫ్లై పరిరక్షణ కేంద్రం, అడవులు వన్యప్రాణుల సంరక్షణ, తదితర వివరాలను అటవీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News January 15, 2025

జాతీయస్థాయి పరీక్షలో నార్మూర్ అమ్మాయి ప్రతిభ

image

నేషనల్ మెటీరియాలజీ ఒలంపియాడ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సోంకామ్లే సోని ప్రతిభ చాటింది. పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. దిల్లీలో శాస్త్రవేత్తల చేతులమీదుగా అవార్డును అందుకుంది..

News January 15, 2025

NRML: శిశువు మృతదేహం లభ్యంపై దర్యాప్తు

image

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. SI శ్రీకాంత్ కథనం ప్రకారం.. అప్పుడే పుట్టిన మగ శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శిశువుకు 5 నుంచి 6 నెలల వయసు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

News January 15, 2025

కౌటాల: కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

image

కౌటాల మండలం జనగామ గ్రామ పల్లె ప్రకృతి వనం సమీపంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్పీ దేవి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసినట్లు ఎస్ఐ మధుకర్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని, 3 కోడిపుంజులు, నగదు రూ.3900, 3 కోడి కత్తులు స్వాధీన చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.