News February 18, 2025

అభా కార్డుల నమోదు పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

image

అభా కార్డుల నమోదు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని బాపట్ల కలెక్టర్ కలెక్టర్ వెంకట మురళి సోమవారం చెప్పారు. ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 85% సర్వే పూర్తి అయ్యిందన్నారు. వేటపాలెం, కర్లపాలెం, యద్దనపూడి మండలాలలో ఈ ప్రక్రియ జాప్యంపై అరా తీశారు. సత్వరమే నూరు శాతానికి ఈ ప్రక్రియ చేరుకునేలా మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంఈవోలు, వైద్య అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: “హైదరాబాద్ రైజింగ్” లక్ష్యం: మంత్రి

image

తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంకేతికత, సంస్కృతి, ఆవిష్కరణలతో శాశ్వత సంబంధాలను నెలకొల్పేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. 2047 నాటికి తెలంగాణ “హైదరాబాద్ రైజింగ్” లక్ష్యంతో సురక్షితమైన నగరంగా మారుతుంది అన్నారు. యువత, మహిళలు, రైతులను శక్తిమంతం చేసేందుకు మానవ మూలధనంపై పెట్టుబడులు పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News November 28, 2025

VKB: కారు బైక్, ఢీ.. ఒకరి మృతి

image

నవాబుపేట మండలం, మైతాబ్ ఖాన్ గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న మోమిన్‌పేట మండలం, దేవరపల్లికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు కూడా అదే గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు ఆరా తీస్తున్నారు.

News November 28, 2025

‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

image

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.