News October 2, 2024

అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్

image

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పిలుపునిచ్చారు. ఆ దిశగా స్వర్ణాంధ్ర- 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. “https://swarnandhra.ap.gov.in” వెబ్సైట్ ఓపెన్ చేసి పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తిచేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Similar News

News October 4, 2024

ప్రకాశం: అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు

image

ప్రకాశం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర తెలిపారు. ఈ నెల 14న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.

News October 4, 2024

ప్రకాశం: అక్రమ రవాణాపై దృష్టి సారించండి: కలెక్టర్

image

జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా మైనింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలను చేశారు.

News October 3, 2024

చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి

image

చీరాల మండలం పాతచీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తులసి పిడుగుపాటుకు గురై గురువారం మృతి చెందింది. దసరా సెలవులు ఇవ్వడంతో తులసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో మేడ పైకి వెళ్లింది. అదే సమయంలో తులసి మీద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.