News January 31, 2025
అభివృద్ధికి నిధులివ్వండి: బండారు శ్రావణి

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం చంద్రబాబును కలిశారు. నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో పెండింగ్ పనుల గురించి వివరించారు. వాటికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు వివరించారు.
Similar News
News February 12, 2025
పల్నాడులో తగ్గిన చికెన్ ధరలు

పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ధరలు దిగివస్తున్నాయి. 10 రోజుల క్రితం కేజీ చికెన్ రూ.280 వరకు ఉంది. ప్రస్తుతం ఈ ధర రూ. 240-260 వరకు విక్రయిస్తున్నారు. తెలంగాణ, గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న కోళ్లకు సంబంధించి వ్యాపారులకు లైవ్ కోడి కేజీ రూ.50-60లు, చికెన్ రూ. 150-160ల వరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ధర తక్కువ ఉన్న చికెన్ పట్ల ప్రజలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
News February 12, 2025
తిరుపతి: ఆమరణ నిరాహారదీక్షలో ప్రత్యేకంగా పోస్టర్

టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వాముల తిరుపతిలో ముంతాజ్ హోటల్ వద్దంటూ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షలో ఓ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తుంది. స్వాములు దీక్ష చేస్తున్న ప్రాంతంలో సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నిస్తున్నట్లు పోస్టర్ ఏర్పాటు చేసుకున్నారు. దీనిని రోడ్డుపై వెళ్లే వారు సైతం ఆగి చూసి మరీ వెళ్తున్నారు.
News February 12, 2025
ఇజ్రాయెల్ రాయబారిని కలిసిన బాపట్ల MP

భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి శ్రీరువాన్ అజార్‌ని బుధవారం బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల పార్లమెంటరి నియోజకవర్గం గురించి ఎంపీ వివరించారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం, జల వనరులు, వ్యాపార అవకాశాలు తదితర అంశాలు గురించి అజార్‌తో ఎంపీ చర్చించారు.