News March 15, 2025
అభివృద్ధికి సహకరిస్తున్న రైతులకు అభినందనలు: కలెక్టర్ ప్రతీక్

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూములను ఇచ్చి సహకరిస్తున్న రైతులకు తగు న్యాయం చేస్తున్నామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో దుద్యాల మండలం హకీంపేట రైతులకు సర్వే నంబర్ 252లో 55.35 ఎకరాల భూమి ఇచ్చిన 31 మంది రైతులకుఅధికారులతో కలిసి కలెక్టర్ నష్టపరిహార చెక్కులను అందజేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు.
Similar News
News November 16, 2025
నగరంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

HYD పరిసరాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. GHMC పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ HYDలో 10 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా BHEL 11.4, రాజేంద్రనగర్ 11.9, శివరాంపల్లి 12.2, గచ్చిబౌలి 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ముక్కు, చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.
News November 16, 2025
ONGCలో 2,623 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ongcindia.com/
News November 16, 2025
హనుమాన్ చాలీసా భావం – 11

లాయ సంజీవన లఖన జియాయే। శ్రీ రఘువీర హరషి ఉరలాయే॥ సంజీవని తెచ్చి హనుమంతుడు లక్ష్మణుడికి ప్రాణం పోశాడు. ఈ ఘనకార్యాన్ని చూసిన రాముడు ఆనందంతో ఆయనను హృదయానికి హత్తుకున్నాడు. మనం నిస్వార్థంగా, అంకితభావంతో, ధైర్యంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఆ శ్రమకు తగిన గౌరవం, ఉన్నతమైన ప్రేమ, అపారమైన ఆనందం లభిస్తాయి. గొప్ప పనులు చేసిన వారిని లోకం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆ దేవుడు కూడా! <<-se>>#HANUMANCHALISA<<>>


