News February 2, 2025

అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుంది: పొంగులేటి

image

ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సత్తుపల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, భరోసానిచ్చారు.

Similar News

News November 13, 2025

ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

image

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.

News November 13, 2025

ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

image

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్‌ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్‌లు ఉన్నాయి.

News November 13, 2025

ఖమ్మం జిల్లాలో 52,260 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

image

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 326 కొనుగోలు కేంద్రాల ద్వారా 52,260 క్వింటాళ్ల నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు. తల్లాడ, కల్లూరు మండలాల్లో 101 మంది రైతుల నుంచి సేకరించిన 5,134 క్వింటాళ్ల సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌గా రూ.25.67 లక్షలు 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆయన వెల్లడించారు.