News May 20, 2024
అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే ఓటమి: KTR
ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కొత్తగూడెంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండే రెండు ప్రధాన కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చెప్పుకోలేకపోవటం ఒక కారణమైతే.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన రెండో తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Similar News
News December 7, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏం కావాలి..?
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగిలిన నాలుగేళ్లలో కొత్తగూడెం ఎయిర్ పోర్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్ట్స్ టైల్ పార్క్ పూర్తి, పలు చోట్ల ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, పలు ఐటీ, ఇతర ఇండస్ట్రీస్‌ను తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మిగిలిన నాలుగు ఏళ్లలో జిల్లాకు ఏం కావాలో కామెంట్స్ చేయండి.
News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి KMM REPORT
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇటీవల భద్రాద్రి ఆలయాన్ని సందర్శించిన రేవంత్.. భద్రాద్రి గోదావరి కరకట్ట పనులను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గానికి జేఎన్టీయూ కాలేజీని మంజూరు చేశారు. ఖమ్మంలో రేపు తుమ్మలతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. ఏడాది పాలనపై మీ కామెంట్.
News December 7, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా హెడ్ లైన్స్
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మణుగూరులో మంచినీటి సరఫరా బంద్ ∆} బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} దమ్మపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష ∆} పెనుబల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన