News February 5, 2025

అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మంత్రి సవిత

image

త్వరలో రూ.8 కోట్లతో బూదిలి వంతెన నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. బుధవారం మంత్రి మేరెడ్డిపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఇప్పటికే గోరంట్ల మండలంలో రూ.6 కోట్ల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. గోకులాల షెడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.

Similar News

News January 20, 2026

నెల్లూరు: పొలంబడి.. తడబడి..!

image

రైతులకు సాగు పాఠాలు నేర్పే పొలం’బడి’ కార్యక్రమం తడబడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో 30 మంది రైతులతో ప్రతీ మంగళ, బుధవారాలు వరుసగా 14 వారాలపాటు కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా ఆచరణలో నీరుగారుతోంది. 24-25 ఏడాదికి జిల్లా వ్యాప్తంగా 31 పొలం బడి శిక్షణ తరగతులు చేపట్టాల్సి ఉన్నా పలుచోట్లా మొదలెట్టలేదు. వీటి నిర్వహణకు ₹10.85 లక్షలు కేటాయించారు. అధికారులు స్పందన లేకపోవడంతో ఆ నిధులు సైతం పక్కదారి పడుతున్నాయట.

News January 20, 2026

మాచారెడ్డి: విద్యార్థి అభిమన్యు ప్రాజెక్టుకు ఎస్పీ ఫిదా!

image

మాచారెడ్డి (M) మర్రితండా వాసి అభిమన్యు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను గమనించి చలించిపోయాడు. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ ప్రాజెక్టును సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్ చంద్రను కలిసి తన ప్రాజెక్టును వివరించాడు. చిన్న వయసులోనే ప్రపంచ శాంతి పట్ల అభిమన్యు చూపిస్తున్న తపనను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

News January 20, 2026

23న రాజధాని రైతులకు ఇ-లాటరీ: నారాయణ

image

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. ‘అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈనెల 23న కేటాయిస్తాం. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. రైతులు వాటిని అప్పటికప్పుడే రిజిస్టర్ చేయించుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ అదే రోజు లాటరీ నిర్వహిస్తాం. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది’ అని తెలిపారు.