News September 25, 2024

అభివృద్ధిలో మాగుంట కుటుంబానికి చెరగని ముద్ర: మంత్రి

image

మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పార్వతమ్మ ఒంగోలు ఎంపీగా నాడు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం చెరగని ముద్ర వేసిందని అన్నారు. మాగుంట పార్వతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Similar News

News October 5, 2024

ఒంగోలులో ఈనెల 8న మినీ జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధి సంస్థ, సీడప్ ఒంగోలువారి ఆధ్వర్యంలో అక్టోబరు 8న, ఒంగోలు ప్రభుత్వ బాలికల ITI కాలేజీలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.ITI, డిడిప్లొమా, టెన్త్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18 సం. నుంచి 30సం. లోపు మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులని జిల్లా అధికారులు రవితేజ, భరద్వాజ్‌లు తెలియజేశారు.

News October 5, 2024

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.

News October 5, 2024

ప్రకాశం: టెట్‌ పరీక్షలకు 63 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లాలో టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు రెండో రోజు శుక్రవారం పరీక్షలకు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి బి సుభధ్ర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్లలో పరీక్షలు జరిగాయి. సాయంత్రం సెషన్‌లో మాత్రమే ఈ పరీక్షలు జరగ్గా, 520 మందికి గానూ 457 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈవో తెలిపారు.