News November 7, 2024
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ: ఎంపీ కావ్య

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రాయపర్తి మండలంలోని పెరికవేడు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎంపీ తెలిపారు.
Similar News
News September 17, 2025
WGL: పసుపు క్వింటా రూ.10,555

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,530 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.,4500 ధర పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,300 ధర వచ్చింది. మరో వైపు దీపిక మిర్చి క్వింటా రూ.14 వేలు, పసుపు రూ.10,555 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
News September 17, 2025
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2025
వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 128.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖిల్లా వరంగల్ మండలంలో అత్యధికంగా 27.8 మి.మీ వర్షం పడగా, గీసుగొండ 18, వరంగల్ 15.8 వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 9.9 మి.మీగా నమోదైంది.