News March 17, 2025

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించం: మంత్రి పొంగులేటి

image

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిన్న ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. పేదల కలలను సాకారం చేస్తూ మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చామన్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టేవిధంగా ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందన్నారు.

Similar News

News November 21, 2025

ములుగు: ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను పెంపొందించడంలో శబరీష్ కృషి

image

ములుగు జిల్లా ఎస్పీ శబరీష్‌ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో నక్సలిజం అణిచివేత, డ్రగ్స్ నిర్మూలనతోపాటు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను పెంపొందించడంలో శబరీష్ చురుకైన పాత్రను పోషించారు. ఆయన సేవలను జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు.

News November 21, 2025

సమర్థవంతంగా చేరేలా సమన్వయంతో పని చేయాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే

image

వరంగల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. వరంగల్ దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారి నిర్మాణాలు, కల్వర్టులు, గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత పాటించాలన్నారు.

News November 21, 2025

మంచిర్యాల: ఆసుపత్రిలో ఆరేళ్ల చిన్నారి మృతి

image

మంచిర్యాలలోని ఓ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాహితి (6) అనే చిన్నారి మృతి చెందింది. వైద్యం సరిగా అందించకపోవడంతోనే చిన్నారి మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్య అధికారులు విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి న్యాయం చేయాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. కాగా గురువారం సైతం ఓ ఆసుపత్రిలో 4నెలల బాబు మృతి చెందిన విషయం తెలిసిందే.