News March 17, 2025

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించం: మంత్రి పొంగులేటి

image

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిన్న ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. పేదల కలలను సాకారం చేస్తూ మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చామన్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టేవిధంగా ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందన్నారు.

Similar News

News April 18, 2025

అన్నమయ్య : ఏకకాలంలో తనిఖీలు 

image

సంఘ విద్రోహక చర్యలను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గురువారం రాత్రి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సోదాలు చేశారు. రాత్రి 9 నుంచి ఆటో, బైక్ కార్, లారీ, బస్సుల పరిశీలుంచారు. ముఖ్యమైన ప్రదేశాలు, రహదారుల్లో పికెట్ ఏర్పాటు చేశారు.

News April 18, 2025

తిరుమలలో కారు దగ్ధం.. భక్తులు సురక్షితం

image

తిరుమలలో ప్రమాదం తప్పింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. కారులో అకస్మాత్తుగా పొగలు రావడంతో వెంటనే భక్తులు దిగేశారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. వాహనం మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News April 18, 2025

అనాసాగరం వద్ద ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నందిగామ పరిధిలోని అనాసాగరం హైవే ఫ్లైఓవర్ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేదాద్రి నుంచి కాలిబాటన గుణదల చర్చికి వెళ్తున్న పసుమర్తి భాస్కరరావు, రుద్రపోగు వెంకటేశ్వర్లును లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

error: Content is protected !!