News November 13, 2024
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవద్దు: డీకే అరుణ

అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.
Similar News
News November 20, 2025
MBNR: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ఎన్నికల కమిషనర్

త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రీయ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి సిఎస్ రామకృష్ణారావుతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
News November 20, 2025
ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో కబడ్డీ జట్ల ఎంపికలు

ఈనెల 23వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో స్త్రీ, పురుష కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.శాంత కుమార్, కురుమూర్తి గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలన్నారు. పురుషులు బరువు 85 కిలోల లోపు, స్త్రీలు 75 కిలోల లోపు ఉండాలన్నారు.
News November 20, 2025
కోయిలకొండ: ఎంపీడీవోల యూనియన్ అధ్యక్షుడిగా ధనుంజయ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లాలో నూతన ఎంపీడీవోల యూనియన్ కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా (కోయిలకొండ) ఎంపీడీవో ధనుంజయ గౌడ్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా (నవాబ్ పేట) ఎంపీడీవో జయరాం నాయక్, జనరల్ సెక్రటరీగా (MBNR) కరుణశ్రీ, కోశాధికారిగా (హన్వాడ) ఎంపీడీవో యశోదమ్మ, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా (జడ్చర్ల) ఎంపీడీవో విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా(భూత్పూర్) ఎంపీడీవో ఉమాదేవి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.


