News November 13, 2024
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవద్దు: డీకే అరుణ
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.
Similar News
News December 8, 2024
ఏం ముఖం పెట్టుకొని సంబరాలు చేస్తున్నారు?: డీకే అరుణ
హైదరాబాద్ సరూర్‌నగర్ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని సంబరాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో రైతులను మభ్యపెట్టడానికి సోయి మరిచి సంబరాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
News December 7, 2024
MBNR: గ్రూప్ -4 సాధించిన కానిస్టేబుళ్లు.. అభినందించిన జిల్లా ఎస్పీ
మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల విధులలో చేరిన 117మంది నూతన కానిస్టేబుల్స్ అభ్యర్థులలో 12 మంది అబ్బాయిలు, ఓ అమ్మాయి మొత్తం 13మంది గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారిని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అభినందించారు. వీరంతా భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.
News December 7, 2024
MBNR: ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్
ఆందోల్ MLA రాజనర్సింహ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆయనకు CM రేవంత్ వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించడంతో పాటు MBNR ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా MBNRలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రుణమాఫీ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తిచేస్తున్నామన్నారు. మీ కామెంట్?