News February 28, 2025
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం: నక్కా ఆనందబాబు

రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత కల్పించారని మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆదాయం, అప్పులు బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తల్లికి వందనం పథకం అమలుకు బడ్జెట్లో రూ.9,407 కోట్లు నిధులు కేటాయించడం శుభ పరిణామం అన్నారు.
Similar News
News February 27, 2026
కర్నూలు కూటమి నేతలకు మంత్రి లోకేశ్ విందు

ఉండవల్లిలోని తన నివాసంలో కర్నూలు పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ గురువారం విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, జయ నాగేశ్వర్ రెడ్డి, పార్థసారథి తదితర నేతలు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అందిన దరఖాస్తుల పరిష్కార స్థితిని మంత్రి వివరించారు. అనంతరం మహిళలకు మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు.
News February 27, 2026
అనంతపురం జిల్లాలో ప్రమాదం.. ఇద్దరి మృతి

అనంతపురం జిల్లా గుత్తి మండలం టి.కొత్తపల్లి సమీపంలోని 63వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఈసురాళ్లపల్లికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 27, 2026
గోల్డ్, సిల్వర్ ETFలు ఇక దేశీయ ధరల్లోనే

ఏప్రిల్ 1 నుంచి గోల్డ్, సిల్వర్ ETFల వాల్యుయేషన్ పద్ధతి మారుతోంది. ఇకపై అంతర్జాతీయ LBMA ధరలకు బదులు మన దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించే ‘స్పాట్ ధరల’ ఆధారంగా వీటి విలువను లెక్కిస్తారు. దీంతో ధరల్లో పారదర్శకత పెరిగి, మన మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా రేట్లు ఉంటాయి. అలాగే విపరీతమైన హెచ్చుతగ్గులను అరికట్టడానికి సెబీ 15 నిమిషాల ‘కూలింగ్-ఆఫ్’ పీరియడ్‌ను కూడా ప్రవేశపెట్టింది.


