News February 28, 2025
అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా రాష్ట్ర బడ్జెట్: కొల్లు రవీంద్ర

రాష్ట్ర పునః నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయమన్నారు.
Similar News
News March 21, 2025
కృష్ణా: ‘అర్హులకు లబ్ధి చేకూర్చాలి’

అర్హులకు ప్రభుత్వ లబ్ధిచేకూరేలా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. జిల్లాల్లో పాలనా వ్యవహారాలు పరిశీలించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లను నియమించిన సంగతి తెలిసిందే. జిల్లాకు నియమితులైన మనజీర్ జిలానీ గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు స్వాగతం పలికారు.
News March 20, 2025
MTM: ‘ఉద్యోగులు కర్మ యోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేయాలి’

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
News March 20, 2025
ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదు

కృష్ణాజిల్లాలోని ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. గురువారం ఎస్‌ఐ విశ్వనాధ్ వివరాల మేరకు.. ఉయ్యూరు ఎస్సీ కాలనీకి చెందిన బాలికపై అదే కాలనీలో నివావసముంటున్న చందు బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.