News December 27, 2024
అభ్యంతరాలు ఉంటే 31లోపు తెలపండి: కలెక్టర్

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. దీనిపై జిల్లాలోని ఎస్సీ పౌరులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు సచివాలయాల్లో అందించాలని తెలిపారు.
Similar News
News November 13, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడి మృతి

ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల ఎస్సీ పాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆటో ఢీకొట్టింది. పామూరు పట్టణంలోని ఆకుల వీధికి చెందిన అయ్యప్ప మాల ధరించిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 13, 2025
విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యంగా ఉండరాదు: CMD

ఒంగోలులోని విద్యుత్ భవన్లో APSPDCL సీఎండీ పుల్లారెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, స్మార్ట్ మీటర్ల గురించి చర్చించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు సూచించారు. జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేసేలా ప్రతి అధికారి ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు.
News November 13, 2025
మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


