News June 12, 2024
అభ్యంతరాలు 15 లోపు తెలియజేయాలి: డీఈఓ సుభధ్ర

స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితాను డీఈఓ వెబ్సైట్‌లో పెట్టినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర మంగళవారం తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి, ప్రధాన ఉపాధ్యాయులకు, ఉప విద్యాశాఖ అధికారికి తెలియజేయాలన్నారు.
Similar News
News March 17, 2025
పదో తరగతి విద్యార్థులకు ALL THE BEST: ప్రకాశం SP

పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆయన ALL THE BEST తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
News March 16, 2025
మహిళా రక్షణ మా ప్రథమ కర్తవ్యం: ఎస్పీ

ప్రకాశం జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆరు బృందాలుగా 36 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శక్తి టీమ్స్ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
News March 16, 2025
ప్రకాశం: 10వ తరగతి ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు

ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లైవ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆరు సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి కాపీయింగ్‌కు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఎగ్జాం సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.