News November 4, 2024
అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ
ఏపీపీఎస్ కు సంబంధించి గ్రూప్ 1,2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చైర్ పర్సన్ అనురాధకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో ఆమెకు వినతిపత్రం అందజేశారు. గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హుల జాబితాను 1:100 నిష్పత్తికి పెంచాలన్నారు. గ్రూప్-2 మెయిన్ పరీక్షకు కనీసం 90 రోజులు వ్యవధి ఉండేలా చూడాలన్నారు.
Similar News
News December 11, 2024
విశాఖ: పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు
వచ్చేనెల 2 నుంచి 8 వరకు విశాఖ- రాయపూర్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, 3 నుంచి 9 వరకు రాయపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు వాల్తేర్ డీసీఎం కే.సందీప్ బుధవారం పేర్కొన్నారు. 3 నుంచి 8 వరకు విశాఖ-భవానిపట్నం స్పెషల్ పాసింజర్, విశాఖ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్, 4 నుంచి 9 వరకు భవానిపట్నం- విశాఖ ప్యాసింజర్, 3 నుంచి 8 వరకు దుర్గ్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు తెలిపారు.
News December 11, 2024
సీఎంతో సమావేశంలో అనకాపల్లి, విశాఖ కలెక్టర్లు
వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెండు రోజుల పాటు జరుగుతున్న కలెక్టర్లు సమావేశంలో విశాఖ, అనకాపల్లి కలెక్టర్లు ఎం.ఎన్ హరిందర్ ప్రసాద్, విజయ కృష్ణన్ పాల్గొన్నారు. రెండు రోజుల సమావేశంలో భాగంగా కలెక్టర్లకు స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న పలు పథకాల అమలపై కూడా చర్చించనున్నారు.
News December 11, 2024
గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.