News February 5, 2025
అమరచింత: బావిలో మునిగి బాలుడు మృతి

వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రప్ప తాండ శివారు బావిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చిన్నచింత కుంట మద్దూరుకి చెందిన గొల్ల నాగరాజు కుమారుడు కురుమూర్తి (15) చంద్రప్ప తాండ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా బాలుడు అస్వస్థతకు గురై కొట్టుమిట్టాడుతూ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News October 26, 2025
కవిత ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా?

నిజామాబాద్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన ఓటమికే <<18110074>>BRS ఎమ్మెల్యేలే<<>> కారణమని ఆరోపించారు. అంతేగాక తన ఓటమికి కొందరు <<18102361>>కుట్ర పన్నరాని<<>> పేర్కొన్నారు. ఇంతకి ఎవరా ఎమ్మెల్యేలు అనే చర్చ జిల్లాలో మెుదలైంది. పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయకున్నా BRS నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కవిత వ్యాఖ్యలపై BRS నేతలు స్పందిస్తారా? మౌనాన్ని పాటిస్తారా వేచి చూడాలి.
News October 26, 2025
మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

అందంగా కనిపించాలని ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజూ కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చర్మానికి రాసినా సమస్య తగ్గుతుంది.
News October 26, 2025
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి: యూటీఎఫ్

పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.


