News February 5, 2025

అమరచింత: బావిలో మునిగి బాలుడు మృతి

image

వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రప్ప తాండ శివారు బావిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చిన్నచింత కుంట మద్దూరుకి చెందిన గొల్ల నాగరాజు కుమారుడు కురుమూర్తి (15) చంద్రప్ప తాండ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా బాలుడు అస్వస్థతకు గురై కొట్టుమిట్టాడుతూ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News January 19, 2026

ఉన్నావ్ అత్యాచార కేసు.. కుల్దీప్ సెంగార్‌కు చుక్కెదురు

image

ఉన్నావ్ <<18703366>>అత్యాచార<<>> ఘటనలో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో విధించిన పదేళ్ల జైలు శిక్షను నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది. శిక్షను సవాలు చేస్తూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను తగిన సమయంలో విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అతడికి బెయిల్ ఇచ్చేందుకూ ధర్మాసనం అంగీకరించలేదు.

News January 19, 2026

వేమన గొప్ప దార్శనికుడు: కడప ఎస్పీ

image

యోగి వేమన గొప్ప సంఘసంస్కర్త, దార్శనికుడు అని కడప ఎస్పీ నచి కేత్ కొనియాడారు. యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. 350 సంవత్సరాల క్రితమే సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలించేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

News January 19, 2026

మళ్లీ ఇండియాకు రాను: విదేశీయురాలు

image

ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికన్ మహిళకు ఢిల్లీ మెట్రోలో చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ సాకుతో వచ్చిన ఓ టీనేజ్ బాలుడు ఆమె బ్రెస్ట్‌ను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణాన్ని అబ్బాయి తల్లి వెనకేసుకొస్తూ అది ‘ఓవర్ యాక్షన్’ అని కొట్టిపారేయడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ‘ఇకపై భారత్‌కు, దక్షిణాసియాకే రాను’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉంది.