News April 10, 2025
అమరజీవి జయంతి ఉత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

పీసీ పల్లి మండలంలో ఈనెల 16వ తేదీన జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి స్వామిని ఆర్యవైశ్య నాయకులు ఆహ్వానించారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను గురువారం కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఒంగోలు గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిజ్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ శిక్షణ మే నెల 21 నుంచి జూన్ 19వ తేదీ వరకు ఉంటుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని, శిక్షణ సమయంలో భోజనం, వసతి పూర్తిగా ఉచితం అని తెలిపారు.
News April 19, 2025
రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.
News April 19, 2025
సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.