News April 10, 2025

అమరజీవి జయంతి ఉత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

image

పీసీ పల్లి మండలంలో ఈనెల 16వ తేదీన జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి స్వామిని ఆర్యవైశ్య నాయకులు ఆహ్వానించారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను గురువారం కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 19, 2025

పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారిగా పురోగతి సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లాలో పీ.ఎం. సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు 78,766 దరఖాస్తులు రాగా, అందులో 1115 గ్రౌండింగ్ చేయగా, 736 మందికి సబ్సిడీ జమ చేసినట్లు పేర్కొన్నారు.

News April 19, 2025

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

ఒంగోలు గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిజ్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ శిక్షణ మే నెల 21 నుంచి జూన్ 19వ తేదీ వరకు ఉంటుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులని, శిక్షణ సమయంలో భోజనం, వసతి పూర్తిగా ఉచితం అని తెలిపారు. 

News April 19, 2025

రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.

error: Content is protected !!