News July 29, 2024

అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు

image

మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కావడంతో జిల్లాలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరిహద్దుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News October 23, 2025

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ

image

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గురువారం కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్ధలం సంబంధించి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీపీ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

News October 23, 2025

ఖమ్మం: మద్యం టెండర్లకు మంచి స్పందన

image

ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభించింది. గురువారం(నేటి)తో దరఖాస్తు గడువు ముగుస్తుండగా, వ్యాపారులు తీవ్రంగా పోటీ పడ్డారు. జిల్లాలోని 116 షాపులకు బుధవారం వరకు ఏకంగా 4,177 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తులు మరింత భారీగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News October 23, 2025

KMM: ‘తక్కువ పెట్టుబడి-ఎక్కువ ఆదాయం’ అంటూ మోసం

image

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఖమ్మం నగరానికి చెందిన ఓ వైద్య విద్యార్థిని ప్రత్యూషను గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. మధురానగర్‌కు చెందిన ప్రత్యూషకు మొబైల్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి.. రూ.40 వేలు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. డబ్బు చెల్లించినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.