News March 25, 2025
అమరావతికి బయలుదేరిన తిరుపతి కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నుంచి రెండు రోజులపాటు అమరావతిలో నిర్వహించుకున్న కలెక్టర్ సదస్సుకు సోమవారం తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల సదస్సులో జిల్లా ప్రగతి, ప్రాజెక్టుల పురోగతి, పలు అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రికి ఆయన అందించనున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి వివిధ అంశాలతో నివేదికలను అధికారులు సిద్ధం చేశారు.
Similar News
News November 21, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. ‘రెబల్ సాబ్’ అనే సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.
News November 21, 2025
యాదాద్రికి కార్తీక మాసంలో ₹17.62 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఈసారి కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నెల రోజులలో ఆలయానికి ₹17,62,33,331 చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ₹3.31 కోట్లు అధికంగా లభించాయి. ఈ మాసంలో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
News November 21, 2025
కుసుమ ప్రతిభకు ఎమ్మెల్యే శ్రావణి సత్కారం

దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి, దేశ కీర్తిని చాటిన నార్పల మండలం దుగుమరి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కుసుమను ఎమ్మెల్యే బండారు శ్రావణి అభినందించారు. కుసుమను, ఆమె కుటుంబ సభ్యులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆర్థిక సాయం అందించారు. ఎవరెస్ట్‌ను అధిరోహించడమే తన లక్ష్యమని కుసుమ తెలపగా, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


