News May 10, 2024
అమరావతిలోనే ప్రమాణ స్వీకారం: RRR

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో రైతుల మధ్య మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు తెలిపారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా గురువారం ప.గో. జిల్లా పెదఅమిరంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ 5 నెలల కింద నగదు విడుదల చేసిన పథకాలకు డబ్బు జమ చేయాలంటూ కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
– RRR వ్యాఖ్యలపై మీరేమంటారు..?
Similar News
News April 17, 2026
ప.గో: జీతాలు రాక హోంగార్డుల పరేషాన్!

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు గత 15 రోజులుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 190 మంది హోంగార్డులకు సుమారు రూ.40 లక్షల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అంకితభావంతో పనిచేస్తున్న తమపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News April 17, 2026
గుర్రపుడెక్కతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ నాగరాణి

కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు పాల్గొన్నారు.