News August 29, 2024
అమరావతిలో నిర్మాణాలపై నేడు కీలక సమావేశం
రాజధానిలో నిర్మాణాల పున:ప్రారంభంపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం CRDA అధికారులు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా నిర్మాణాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టగా, ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా భవనాలు నిర్మాణాలు జరగనున్నాయి.
Similar News
News September 14, 2024
గుంటూరు: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 25 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల విభాగం తెలిపింది.
News September 14, 2024
17న నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ: DMHO
జాతీయ నులి పురుగుల నివారణ దినం సందర్భంగా ఈ నెల 17న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి వెల్లడించారు. మధ్యాహ్నం బోజనం అనంతరం 1-2 సంవత్సరాల వయసు వారికి ఆల్బెండ జోల్ అరమాత్ర, 2-19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News September 14, 2024
లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోండి : ఎస్పీ
నేడు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కక్షిదారులు కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. చెక్ బౌన్స్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు ఉన్న కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.