News December 7, 2024

అమరావతిలో నిర్మాణాల పునః ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం 

image

అమరావతి ప్రాంతంలో పనుల పునః ప్రారంభంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించననుంది. ఎంపిక చేసిన పలు కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు వివిధ ప్రాజెక్టు పనులు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. కాగా కూటమి అధికారంలోకి రాగానే అమరావతిలో పర్యటించడంతో పాటు.. భవనాల పటిష్ఠతపై నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. 

Similar News

News January 22, 2025

ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసిన గుంటూరు ఎస్పీ

image

పోలీస్ సర్వీస్ నియమాలకు విరుద్ధంగా నగదు అప్పు తీసుకుని చెల్లించని ఘటనల్లో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సతీశ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారిలో ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఉన్నారు. వీరు ముగ్గురు ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీస్ నియమాలు-1964 లోని మూడవ నిబంధన ఉల్లంఘించారని, ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు ఎస్సీ తెలిపారు.

News January 22, 2025

మాచవరం: ఆమెపై లైంగిక దాడికి మరో మహిళ సహాయం

image

మాచవరంలో మహిళపై లైంగిక దాడికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ మంగళవారం తెలిపారు. ఎస్సై కథనం.. మాచవరానికి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో స్నేహం ఉండేది. ఇటీవల ఆమెకు వేరే వ్యక్తితో వివాహం కుదిరింది. ఈ క్రమంలో స్నేహితునితో కలిసి దిగిన ఫొటోలను ఇవ్వాలంటూ అడిగింది. ఫొటోలు ఇస్తానని తెలంగాణకు తీసుకొచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. అతనికి సహకరించిన మరో మహిళపై కేసు నమోదైంది.

News January 22, 2025

అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

image

తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాల్లోని నివాసాలను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధిత శాఖలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, రైల్వే, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో 16,025 నివాసాలు గుర్తించామన్నారు.