News March 29, 2025
అమరావతిలో మొదలైన నిర్మాణ పనుల సందడి

ఎన్టీఆర్: ఏప్రిల్ 3వ వారంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భవననిర్మాణ సామాగ్రి అమరావతికి తరలి వెళుతోంది. అటు విజయవాడ, గుంటూరు మీదుగా కోర్ క్యాపిటల్ ప్రాంతానికి గుత్తేదారు సంస్థలు యంత్రాలు, కార్మికులను తరలిస్తున్నాయి. ఇటీవలే రూ.37వేల కోట్లపైచిలుకు పనులు చేపట్టేందుకు గుత్తేదార్లకు లెటర్ ఆఫ్ అవార్డ్స్(LOA) అందజేయగా ఆ సంస్థలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తున్నాయి.
Similar News
News December 13, 2025
మాటలతో యుద్ధాలు గెలవలేం: CDS అనిల్ చౌహాన్

దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చారు. మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన టార్గెట్, చర్యలే విజయాన్ని అందిస్తాయని అన్నారు. సైన్యం నిబద్ధతలోనే భారత్ బలం దాగి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామన్నారు.
News December 13, 2025
భూపాలపల్లి: రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

పలిమెల, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.


